జగనన్న వదిలిన బాణానన్న షర్మిల
Publish Date:Oct 18, 2012
Advertisement
చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్రకి పోటీగా వై.ఎస్ జగన్ పార్టీ తరఫున షర్మిల ఈ రోజు పాదయాత్రని మొదలుపెట్టారు. ఇడుపులపాయనుంచి ఇచ్చాపురంవరకూ ఈ యాత్ర సాగుతుంది. వై.ఎస్ సమాధికి నివాళులర్పించిన తర్వాత పాదయాత్రకోసం తరలివచ్చిన అభిమానుల్ని ఉద్దేశించి విజయలక్ష్మి ప్రసంగించారు. ఉన్న ఇద్దరు బిడ్డలో ఓ బిడ్డ జైల్లో ఉంటే మరో బిడ్డ ప్రజాభిమానాన్ని కూడగట్టేందుకు రోడ్డెక్కిందంటూ ఉద్వేగ భరితంగా ప్రసంగించిన ఆమె తన బిడ్డలిద్దరినీ జనం చేతుల్లో పెడుతున్నానని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కాంగ్రెస్, టిడిపి కలిసి పోయి ఉద్దేశపూర్వకంగా కుట్రలు పన్ని జగన్ ని జైల్లో పెట్టారంటూ షర్మిల ఆవేశంగా మాట్లాడారు. ప్రజాభిమానంముందు కుతంత్రాలేవీ నిలవలేవంటూ అభిమానుల అభిమానాన్ని చూరగొనే ప్రయత్నం చేశారు. మరోపక్క.. వస్తున్నా మీకోసం పాదయాత్రకు లభిస్తున్న స్పందనని చూసి కంగారుపడ్డ వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ నేతలు షర్మిలను రంగంలోకి దించి యాత్రని మొదలుపెట్టించాయంటూ టిడిపి నేతలు విమర్శిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/sharmila-yatra|-idupulapaya-yatra|-sharmila-fire-on-babu|-huge-crowd-at-idupulapaya|-tributues-to-ys|-ys-jagan-in-jail|-destiny-icchhaapuram|-sharmila-prized-jagan|-sharmila-on-ysr-31-18313.html





